ఆకాశాన్నంటుతున్న సన్న బియ్యం ధరలు

24-10-2026 | 08:19pm

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 24 విజయక్రాంతి : ఆరుకాలం పండించిన రైతుకు(Farmer) గిట్టుబాటు ధర లేక రోడ్లపై ధాన్యాన్ని పారబోసి నిరసన తెలిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తీరా రైతు దగ్గరి నుంచి ధాన్యం(Grain) దళారుల చేతుల్లోకి వెళ్లడంతో ఎల్నినో ప్రభావాన్ని చూపిస్తూ రూ.60 ఉన్న బియ్యం ధర ఏకంగా రూ.90 నుంచి రూ. 100 వరకు పెరిగింది. కిలో సాంబా మసూరి బియ్యం(Samba Masuri rice) ధర పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం రేషన్ దుకాణాల(Government ration shops) ద్వారా మూడు నెలలకు ఒకసారి బియ్యం అందజేస్తుంటే, చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఏకంగా బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్లాక్ మార్కెట్కు కళ్లెం వేయాల్సిన సివిల్ సప్లై అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని .స్థానికులుచర్చించుకుంటున్నారు.

గత నెల రోజుల వరకు మిల్లుల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్న ధాన్యం బస్తాలు, పెరిగిపోవడంతో కనుమరుగయ్యాయి. వీటన్నింటికీ ధరలు కారణం బ్లాక్ మార్కెట్ దందా కొనసాగడమేనని, అందువల్లే బియ్యం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా సివిల్ సప్లె అధికారులు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మిల్లులపై దాడులు నిర్వహిస్తే కొంతవరకైనా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సివిల్ సప్లై సప్లై అధికారులు బాధ్యతగా గుర్తించి, ఆకాశాన్నంటుతున్న ధరలకు కళ్లెం వేస్తారో లేదో వేచి చూడాల్సి ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు