రైతుల రుణాలు మాఫీ చేయాలి

24-10-2026 | 08:41pm

* పచ్చిమట్ల రవీందర్‌ గౌడ్‌

* బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి

కోహెడ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో(impact of El Niño) కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతుల పంట రుణాలు(Crop loans for farmers), గృహ రుణాలు, విద్యా రుణాలతో పాటు ఇతర రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని బీఎస్పీ హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం హుస్నాబాద్(Husnabad) లో మాట్లాడుతూ.. పంటల సాగుకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించే బదులు, రైతు కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు కోతుల బెడద ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. కోతుల వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుండటంతో రైతులు వరి సాగు మినహా ఇతర పంటల వైపు వెళ్లలేకపోతున్నారని అన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కోతుల సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

మూడేళ్లు గడిచినా సమస్య పరిష్కారానికి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని పేర్కొన్నారు. కరువు పరిస్థితులు ఏర్పడితే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీతో పాటు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గంగుల రాజయ్య, కాశవేణి ఓదయ్య, దొంతరమైన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు