ప్రజాస్వామ్యంపై దౌర్జన్యమా

24-10-2026 | 08:33pm

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సిర్గాపూర్ మండల పరిధిలోని సంగెం గ్రామ బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన సర్పంచ్‌ ధర్మానాయక్(Sarpanch Dharmanayak), ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడి ఘటన తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే మచ్చగా అభివర్ణించేలా అధికార కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు గ్రామాలల్లో చేస్తున్న దుశ్చర్యలు నేడు ప్రతి చోట చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోనేది లేదన్నారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. మునుముందు ఇటువంటి చర్యలు పునరావృతం ఐతే సహించేది లేదని ప్రతిచర్యలు తప్పవని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మెన్ గుర్రపు మచ్చేందర్ హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నాయకులు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మెన్ గుర్రపు మచ్చేందర్ వారితో పాటుగా ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు