వ్యక్తి ఆత్మహత్య.. ఇద్దరు చిన్నారులకు తీరని లోటు

14-11-2026 | 01:41pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 14 (విజయ క్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వీరభద్రవరం పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బట్టా నాగేంద్రబాబు (28) శుక్రవారం అర్ధరాత్రి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Suicide Case).

మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు (Family Tragedy). ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు (Postmortem Examination). కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు (Police Investigation). ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు