టీమిండియాలో కీలక మార్పులు

14-11-2026 | 11:11am

కుల్దీప్ ఔట్.. గర్నూర్ ఇన్.. ఇదేంటి బాస్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్‌ల Test Series కోసం యువ పేసర్ గర్నూర్ బ్రార్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టెస్ట్ జట్టు నుంచి విడుదల చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అతడికి అవకాశం కల్పించినట్లు BCCI ప్రకటించింది. నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు గర్నూర్ బ్రార్ జట్టుతో కలవనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పటికే టెస్ట్ జట్టు సభ్యులతో చేరాడు. గర్నూర్ ఐదో వన్డేకు అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయకూడదని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

భారత్ టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, గర్నూర్ బ్రార్.

ఐదో వన్డేకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

మరిన్ని వార్తలు