ఆల్ఫాజోల్ అక్రమ నిల్వపై ఈగల్ టీం దాడులు!
14-11-2026 | 02:04pm
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లాలో ఆల్ఫాజోల్ అక్రమ నిల్వపై ఈగల్ టీం (EAGLE Team), పోలీసు అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు (Joint Raids) నిర్వహించారు. బిజినేపల్లి మండలంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు కిలోల ద్రవరూప ఆల్ఫాజోల్ను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నిల్వలపై అందిన సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఆల్ఫాజోల్ (Liquid Alprazolam) ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరి కోసం నిల్వ చేశారు? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.