సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చు

14-11-2026 | 02:31pm

చెన్నూర్ (విజయక్రాంతి): పంటల సాగు, చీడపీడల నివారణ, సస్యరక్షణ పద్ధతులు, అధిక దిగుబడుల సాధనపై ఎల్ఎస్ఆర్ సీడ్స్ కంపెనీ (LSR Seeds) ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి, ఆర్ఎస్ఎం నాంపల్లి తిరుపతి మాట్లాడుతూ ఫిదా బీజీ-2 (Fida BG-2) విత్తనం ద్వారా పెద్ద పరిమాణంలో, అధిక బరువున్న పత్తి కాయలు వస్తాయని వివరించారు. పురుగులు, దోమలు, పేనుబంక వంటి చీడపీడలను తట్టుకునే సామర్థ్యం ఈ విత్తనానికి ఉందని తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన దుర్గం సురేష్ పత్తి చేనును క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట పరిస్థితిని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాలకు చెందిన 153 మంది రైతులు పాల్గొన్నారు.

రైతు ఆగ్రోస్ డిస్ట్రిబ్యూటర్ (జనగామ), రాజరాజేశ్వర ఫెర్టిలైజర్స్ (రొయ్యలపల్లి), ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ డీలర్ పల్లె సాయికుమార్, కంపెనీ ప్రతినిధులు గట్టు రామకృష్ణ గౌడ్, పి. జీవన్ (మంథని), కె. నరేష్ (ఆసిఫాబాద్) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు