హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్కు ఘన స్వాగతం
మహబూబ్నగర్ (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్కు (Telangana High Court Judge) మహబూబ్నగర్లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి. జానకి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత ఘన స్వాగతం పలికారు.
ఆర్ అండ్ బి అతిథి గృహానికి (R&B Guest House) చేరుకున్న న్యాయమూర్తికి మొక్కను అందజేసి ఆహ్వానించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని (Guard of Honour) స్వీకరించారు.అంతకుముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని (Manyamkonda Temple) దర్శించుకున్న జస్టిస్ పుల్లా కార్తీక్, అనంతరం గద్వాల జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.