‘పంచనామా’తో నిర్మాతగా కొత్త ప్రయాణం
08-09-2026 | 09:09am
‘ఉదయభాను(Udayabhanu) ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘పంచనామా’(Panchanama web series) తెరకెక్కుతోంది. ఇండస్ట్రీలో యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. ఈ సిరీస్‌తో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. నిర్మాతగా ఆమె ఏ మేరకు రాణిస్తారో చూడాలి.ఈ సిరీస్‌లో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మోహన్ శ్రీవాత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 11 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.