బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుపై నిరసన
చేగుంట సెప్టెంబర్ 08, విజయక్రాంతి: వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ(Assembly)లోకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను పోలీసులతో అడ్డుకుని,అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చేగుంట బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి మెమోరండం అందించి గాంధీ చౌరస్తా వద్ద రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు, జెండాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను,13 డిక్లేషన్లు,6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి. సోమ సత్యనారాయణ. కామర పంజనేయులు. పుర లక్ష్మణ్. జనరల్ సింగ్. డిష్ రాజు. కటిక రాజేష్. భువనగిరి నరసింహులు. రెడ్డిపల్లి నరసింహులు. నీల రాములు. శంకర్. మహేష్.. మంచి కట్ల వంశీ. వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.