రూ.35 లక్షల సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

08-09-2026 | 02:24pm

టేకులపల్లి, (విజయక్రాంతి):టేకులపల్లి మండలం పెగల్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామ మహిళలు హరతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, లక్కినేని శ్యామ్, కాలే ప్రసాద్, సర్పంచ్ కోరం హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు