గజ్వేల్‌కు కేటీఆర్, హరీష్ రావు..!
08-09-2026 | 12:31pm
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయల్దేరారు. వారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, తాజా రాజకీయ అంశాలపై కేసీఆర్‌తో నేతలు చర్చించే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ వ్యూహంపై కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.