బోయిన్‌పల్లి పీఎస్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ అరెస్ట్

08-09-2026 | 02:01pm

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)ను పోలీసులు బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కేటీఆర్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు