రీల్స్‌కు అడ్డొచ్చిన నెట్‌.. చివరికి విషాదం

08-09-2026 | 02:53pm

ఛత్తీస్ గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రీల్స్‌ చూసే అలవాటు ఉన్న 52 ఏళ్ల మంగ్లో బాయి సారథి ఇంటర్నెట్‌ పదేపదే నిలిచిపోవడంతో తీవ్ర అసహనానికి గురైంది. దీంతో ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన అనంతరం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు