స్పీకర్‌‎పై వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు

08-09-2026 | 03:23pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌(Congress) నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ సూచనలతో మండల కేంద్రంలో మంగళవారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ బైరెడ్డి భగవాన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.

తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా ఈ ఘటనపై స్పందించి క్షమాపణ చెప్పాలని కోరారు. స్పీకర్‌ ను అవమానించేలా మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు