అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం
జనగామ, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ అరాచక పాలనకు నిరసనగా ఈరోజు జనగామ చౌరస్తాలోని డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) వినతిపత్రం అందజేశారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు,మాట్లాడుతూ.. 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, త్వరలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అధికారుల లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. దళిత స్పీకర్ ను అవమానించారని అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు దళితులే బుద్ధి చెబుతారని, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల వ్యవహరించిన తీరు క్షమించరానిదని అన్నారు.రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని, కాంగ్రెస్ హటావో - రాష్ట్ర బచావో నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.