ఛట్ పూజ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
పటాన్ చెరు నవంబర్ 13 : పటాన్ చెరు(Patancheru) నవంబర్ 15న పటాన్ చెరు సాకి చెరువు వేదికగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఛట్ పూజ మహోత్సవ(Chhath Puja Festival) ఏర్పాట్లను మాద్రి పృథ్వీరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఛట్ పూజకు హాజరయ్యే భక్తులకు(devotees) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు, వాలంటీర్ల సమన్వయం, భద్రతా చర్యలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చోట తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని నిర్వాహకులకు భరోసా ఇచ్చారు.
ఈ మహోత్సవంలో ప్రముఖ భోజ్పురి గాయకుడు రితేష్ పాండే, గాయని కావ్య తమ సంగీత విభావరితో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛట్ పూజ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.