మిర్చి రైతులకి ధనుకా అవగాహనా సదస్సు

13-11-2026 | 11:10pm

కన్నాయిగూడెం, నవంబర్ 14(విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి హారిక ఫర్టిలైజర్ మరియు ధనుకా అగ్రిటెక్ ప్రైవేట్  లిమిటెడ్ కంపెనీ(Harika Fertilizer and Dhanuka Agritech Private Limited) ఆధ్వర్యంలో  మిర్చి రైతులకి అవగాహనా సదస్సును శుక్రవారం నిర్వహించారు. ధనుకా కంపెనీ ప్రొడక్ట్స్ డిసైడ్, లానివో, మోర్టార్   కోనిక, దిన్ కర్, మైకోర్ సూపర్, సెంప్ర, జనైట్, కెంపా వంటి మందుల పనితనంపై  ప్రాజెక్టర్ సహాయంతో రైతులకు  అవగాహనా సదస్సు నిర్వహించారు.

వరంగల్ ఏరియా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ధనుకా కంపెనీ అనేది 1980 సంవత్సరంలో స్థాపించడం జరిగిందని హర్యానా రాష్ట్రంలో ప్రధాన కార్యాలయం ఉందని అన్నారు. ధనుకా కంపెనీలో కీటక నాశకాలు (insecticides ), శిలీంద్రనాశకాలు (fungicides ), మొక్కల పెరుగుదల (plant growth regulators)వంటి 90కి పైగా ఉత్పత్తులను తయారు చేసి కంపెనీ విక్రాయించడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో దాదాపు 6500కి పైగా డిస్ట్రిబ్యూటర్లు, 80వేల మంది రిటేలర్ల నెట్వర్క్ ద్వారా సుమారు 1కోటి మంది రైతులకు సేవలు అందిస్తుందని అన్నారు.

మిర్చి పంటలో వచ్చే చలికాలంలో వచ్చే వేరు కుళ్ళు, కొమ్మ కుళ్ళు, ఆకుముడత, నల్ల తామర, ఎర్రనల్లి, పేనుబంక, తెల్లతామర, పై ముడత, కింది ముడత వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ లింగయ్య, హారిక ఫర్టిలైజర్ యజమాని అబ్బు సతీష్ మరియు వివిధ గ్రామాల రైతులు సుమారుగా 150-170 మంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు