నూతన సీఐ గా శ్రీధర్ బాధ్యతల స్వీకరణ
13-11-2026 | 10:54pm
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 13, విజయక్రాంతి : వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో పోలీస్ స్టేషన్(Police Station) నూతన సీఐగా శ్రీధర్(Sridhar Takes Charge) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన సిఐ మాట్లాడుతూ.. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు(antisocial activities) పాల్పడితే తమకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.