గార్లపల్లిలో చోరీ..
బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణ
మునిపల్లి నవంబర్ 13 ( విజయక్రాంతి ): బంగారం, వెండి ఆభరణాలతో(Gold and silver ornaments) పాటు నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన సంఘటన(incident of abduction) మండలంలోని గార్లపల్లి గ్రామంలో(Garlapalli Village) శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్ఐ అరవింద్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్లపల్లి గ్రామానికి చెందిన మంగలి మాణయ్య అనే వ్యక్తి రాత్రి పెద్ద ఇంటికి తాళం వేసి ఆనుకొని ఉన్న చిన్న ఇంట్లో నిద్రించారు. అయితే తెల్లవారుజాము లేచి చూడగానే పెద్ద ఇంటికి వేసిన తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉండడంతో భార్యభర్తలిద్దరు షాక్ అయ్యారు.
దీంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగానే బీరువాలో ఉన్న రెండు తలాల బంగారం, 28తులాల వెండి ఆభరణాలతోపాటు నగదును గుర్తు తెలియని దొంగలించారు. ఈ విషయాన్ని మునిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుల వేలి ముద్రలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరవింద్ తెలిపారు.