రోడ్డెక్కనున్న డెలివరీ బాయ్స్.. రాహుల్కు ఆహ్వానం
హైదరాబాద్: తమ హక్కుల సాధన కోసం గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు మరోసారి గళమెత్తనున్నారు. సామాజిక భద్రత, మెరుగైన పని పరిస్థితులు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్లతో హైదరాబాద్లో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఆధ్వర్యంలో రేపు ఈ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ వెల్లడించారు.
రాహుల్ గాంధీకి ప్రత్యేక ఆహ్వానం
ఈ ర్యాలీకి హాజరై కార్మికుల పోరాటానికి మద్దతు తెలపాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని యూనియన్ ఆహ్వానించింది. 2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ వర్కర్ల సమస్యలపై రాహుల్ గాంధీ చూపిన చొరవ, మద్దతును యూనియన్ గుర్తుచేసుకుంది. అప్పట్లో ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరోసారి తమ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని కోరినట్లు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
శిల్పకళా వేదిక నుంచి హైటెక్స్ వరకు ర్యాలీ
నగరంలోని శిల్పకళా వేదిక నుంచి ఈ భారీ ప్రదర్శన ప్రారంభం కానుంది. అక్కడి నుంచి Hyderabad International Convention Centre (HICC), హైటెక్స్ ప్రాంతం వరకు ర్యాలీ కొనసాగనుంది. Food Delivery, Transportation, E-commerce తదితర Digital Platforms ద్వారా పనిచేస్తున్న కార్మికులు ఇందులో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కొత్త చట్టంతో కార్మికులకు భరోసా
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన Telangana Gig and Platform Workers Act-2026 ఈ ఉద్యమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా గిగ్ కార్మికుల Registration తప్పనిసరి చేయడం, Social Security Benefits అందించడం, ప్రత్యేక Welfare Board ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించడం వంటి అంశాలకు చట్టబద్ధత లభించింది.
హక్కులు కాగితాలకే పరిమితం కావొద్దు!
కొత్త చట్టం అమలుకు అవసరమైన Rules రూపొందించడంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని యూనియన్ తెలిపింది. కార్మికుల నమోదు, వారి సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక App కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. అయితే చట్టం తీసుకొచ్చినంత మాత్రాన సరిపోదని, అందులో పేర్కొన్న ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఆరోగ్య రక్షణ, మెరుగైన ఆదాయం, పారదర్శకమైన పని విధానాలు తమకు అందాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చట్టంలోని హామీలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపటి ర్యాలీలో తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.