భోగిలో అన్నీ చరిత్రలో నిలిచిపోయే పాటలే!

26-11-2026 | 05:35am

చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa) పూర్తిగా రస్టిక్ అవతార్‌లొ కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్(Intense Period Action) డ్రామా ‘భోగి(Bhogi)’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఈ మూవీ మేకర్స్ మ్యూజికల్ ఈవెంట్(musical event) నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ.. “ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్ చేశా. కార్తీక పౌర్ణమి రోజు ‘గంగా’ పాటను విడుదల చేయడం చాలా సంతోషం.

చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం రాయడం నా అదృష్టం. భీమ్స్ ప్రాణం పెట్టి పనిచేశారు. సంపత్ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఈ సినిమాకు ఒక కొత్త నడిగానే ఫీల్ అయ్యా. నా కెరీర్‌లో 37 సినిమాలకు ఎంత కష్టపడ్డానో, ఈ ఒక్క సినిమాకు అంత కష్టపడ్డా. బ్లడ్ పెట్టి ఈ సినిమాకు పనిచేశా. డింపుల్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అనుపమ కూడా చాలా అద్భుతంగా నటించింది” అన్నారు. డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “ఈ సినిమా పాటలకు ఇంత మంచి ఆదరణ దక్కడానికి మొదటి కారణం చంద్రబోస్.

ఆయన చరిత్రలో నిలిచిపోయే పాటలు రాశారు. ఇందులో పాటలన్నీ మట్టి వాసన గుబాళించేలా ఉన్నాయి. ఇప్పటివరకు శర్వానంద్‌లో బెస్ట్ చూశారు. ఈ సినిమాలో ఆయన బీస్ట్ చూస్తారు” అని చెప్పారు. ‘మా నటీనటులకు, తెర వెనుక పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు’ అని నిర్మాత రాధామోహన్ తెలిపారు. హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయ్యి ఈ జోనర్లో వస్తున్న సినిమా ఇది” అని చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. “ప్రాణం పెట్టి పనిచేశాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు తప్పకుండా చాలా గొప్ప అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది” అని తెలిపారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో రాసిన ప్రతి మాట కూడా కథ నుంచి పుట్టింది. కచ్చితంగా అందరి కష్టం ఫలిస్తుంది” అన్నారు. ఈ వేడుక సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు