ఎంపీడీవో కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
26-11-2026 | 08:03pm
బోథ్. నవంబర్ 26 (విజయ క్రాంతి) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో(MPDO Office) రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఎంపీడీవో రమేష్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల తో పాటు విధులను సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.