ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి

05-11-2026 | 05:01pm

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి పిలుపు..

ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును(MLC Voter Registration) అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు(BRS State-level leaders) కల్లూరి రామచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల సెక్రటరీ జనరల్ రచ్చ రామ్ నరసయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ కుండే సంపత్, మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నరసింహులు, మాజీ వార్డు సభ్యుడు జింకల రామకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ గిరిరాజు వెంకటయ్య, నాగరాజు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు