అంగన్వాడీ భవనం నిర్మించాలని డిమాండ్

05-11-2026 | 05:07pm

ములకలపల్లి,నవంబర్ 5 (విజయక్రాంతి): మురుసు తూఫాన్ కారణంగా మాధారం అంగన్వాడీ అద్దె భవనం(Madharam Anganwadi Rented Building) అధ్వాన్నంగా తయారైందని వెంటనే నూతన అంగన్వాడి భవనం(Anganwadi Building) నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని మాదారంలోని అంగన్వాడీ కేంద్రాన్ని అయన సందర్శించి గ్రామస్తులు, అంగన్వాడీ టిచర్లు,చిన్నారులతో కలిసి అంగన్వాడీ ముందు నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అంగన్వాడీ కేంద్రానికి రాగానే మొత్తం బురద కనిపించడంతో కొంత మంది విద్యార్థులు వెనుతిరిగి ఇంటికి వెళ్ళి పోయినారన్నారు‌. మాదారం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ సెంటర్ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్మించిన భవనం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

అద్దె అంగన్వాడీ లో చిన్నారులకు టాయిలెట్లు లేక చిన్నారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాదారంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలు ఒకే దగ్గర నడపడంతో పాటు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.మాదారం గ్రామంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల లకు నూతన భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చనగాని వినోద్, పసుల సూర్య, ముదిగొండ రవి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు