రణబాలి జోష్

18-09-2026 | 05:25am

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabali) షూటింగ్ పూర్తయింది. మొత్తం 130 రోజుల పాటు భారీ ఎత్తున, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమ్ చేసుకున్న సెలబ్రేషన్స్‌ను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అతుల్; డీవోపీ: నీరవ్ షా, జిష్ణు భట్టాచర్జీ; యాక్షన్: యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం. 

మరిన్ని వార్తలు