హార్ట్ ఆఫ్ కాకా.. ఈ అమ్ములు పాప!

09-09-2026 | 05:25am

‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. దీన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న హీరోయిన్ అనస్వర రాజన్ పుట్టినరోజు మంగళవారమే. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

తాజా పోస్టర్‌లో అనస్వర వెనుక గోడపై మెగాస్టార్ చిరంజీవి సిల్హౌట్ కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనస్వరను రక్షించడానికి చిరంజీవి ‘సత్యం’ పాత్ర అక్కడ ఉందని హింట్ ఇస్తోంది. అందుకే అనస్వరను మేకర్స్ హార్ట్ ఆఫ్ కాకాగా ఆమె పాత్రను ‘అమ్ములు పాప’గా రివిల్ చేశా రు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న థియేటర్లలో విడు దల కానున్న ఈ చిత్రానికి సం గీతం: థమన్; డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్; ఎడిటర్: ఆంటోనీ రూబెన్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా. 

అంతా రాములోరు చూస్కుంటారు టీమ్ విషెస్ 

యంగ్ హీరో సంగీత్ శోభన్, అనస్వర జంటగా నటిస్తున్న సినిమా ‘అంతా రాములోరు చూస్కుంటారు’. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాతలు. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్టర్. మంగళవారం అనస్వర పుట్టిన రోజు సందర్భంగా మూవీటీమ్ ఓ స్పెషల్ పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపింది. అనస్వర ఈ చిత్రంలో శిరీష పాత్రలో అలరించనుంది. 

మరిన్ని వార్తలు