Breaking News

ప్రజాపాలనకు జనం జై.. బీఆర్‌ఎస్‌కు ఎందుకీ గగ్గోలు?

09-09-2026 | 03:52pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక నానా జిమ్మిక్కులు చేస్తున్నారని ఘట్ కేసర్ సర్కిల్ పోచారం, ఘట్ కేసర్, ఎదులాబాద్ డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, బొక్క ప్రభాకర్ రెడ్డి, సామల అమర్ ఆరోపించారు. వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనకు సంబంధించి 1000 రోజుల సంబరాలు జరుపుతుంటే బిఆర్ఎస్ నాయకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ నిరసనలు తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రజల సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి రాకుండా కోట్లాది రూపాయలు వేతనం పొందుతూ ఫామ్ హౌస్ లో ఉండటం సిగ్గుచేటు అన్నారు. వెం

టనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల డ్రస్సులు ధరించి అసెంబ్లీకి రావడం, పోలీసులపైనే దౌర్జన్యం చేయడం ఏమిటన్నారు. దళితుడైన స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఉపముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు.  బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలు గుర్తిస్తున్నారని రానున్న రోజుల్లో పాతాళానికి తొక్కడం ఖాయమన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నారని దీంతో  బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతో నానా హంగామా  చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొక్క సంజీవరెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు