Breaking News

కరీంనగర్‌లో ఇండియా సిటీ లెవల్ రగ్బీ టోర్నమెంట్

09-09-2026 | 04:17pm

ముకరంపుర, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి): వెలికితీయడంతో పాటు, ముఖ్యంగా బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా సిటీ లెవల్ రగ్బీ టోర్నమెంట్(Rugby tournament) కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో  జరిగింది.ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రగ్బీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం,పట్టుదలతో పాటు నాయకత్వ పటిమ  పెరుగుతుందని అన్నారు.

చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు యువత, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఖేలో ఇండియా–అస్మిత వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని మేయర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ శివకృష్ణ, పెద్దపల్లి జిల్లా సెక్రటరీ రామకృష్ణ, సిద్దిపేట జిల్లా సెక్రటరీ అజయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రటరీ హనుమంతు, జగిత్యాల జిల్లా సెక్రటరీ మహిపాల్, వెంకటేశ్వర హాస్పిటల్ అడ్మిన్ వెంకటేశ్వర్లు, రగ్బీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు