రజక బజార్‌లో ఘనంగా కర్ర పూజ

05-10-2026 | 06:51pm

నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న 47వ డివిజన్ కార్పొరేటర్ జి.వి.ఆర్

పాల్వంచ,(విజయక్రాంతి): దసరా నవరాత్రి మహోత్సవాల్లో(Dasara Navaratri celebrations) భాగంగా పాత పాల్వంచ(Palvancha) రజక బజార్‌లో నిర్వహించిన ‘కర్ర పూజ’(Karra Puja ) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సోమవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి 47వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు(Corporator Gurram Venkateshwarlu) ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాత పాల్వంచ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని జగన్మాతను ప్రార్థించినట్లు తెలిపారు.

నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన జి.వి.ఆర్ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాల్లో ప్రజలతో మమేకమై ముందుకు సాగారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన కర్ర పూజ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు