పెద్దపల్లి ఎంఐఎం నూతన పట్టణ కమిటీ నియామకం

23-10-2026 | 07:18pm

కరీంనగర్, అక్టోబరు 23 (విజయక్రాంతి): ఎంఐఎం పెద్దపల్లి(MIM Peddapalli) పట్టణ అధ్యక్షుడిగా సయ్యద్ ఉమెర్ ను, నూతన కమిటీని  నియమించినట్లు ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్(Syed Ghulam Ahmed Hussain) తెలిపారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణ నూతన కమిటీని శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యాలయం దారుస్సలాంలో నియామక పత్రాన్ని నూతన కమిటీకి  గులాం అహ్మద్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. పెద్దపల్లి పట్టణంలో ఎంఐఎం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అలుపెరుగకుండా అహర్నిశలు పాటు పడాలన్నారు.

పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడిగా సయ్యద్ ఉమేర్ అహ్మద్, ఉపాధ్యక్షుడుగా అడ్వకేట్ ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శిగా కలీమ్, జాయింట్ సెక్రటరీలుగా సయ్యద్ ముజాహిద్, ఇర్ఫాన్ అలీ, ఖాజా మోహినుద్దీన్, షేక్ బర్కత్, కోశాధికారిగా ముఫ్తి ఇంతియాజ్ ఖాన్ అసాధి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షేక్ పర్వేజ్, ఇమ్రానోద్దీన్, ముజీబోద్దీన్, ఫుర్ఖాన్, ముజీబ్ ఖాన్, షోయబ్ ఖాన్ లను నియమించినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ తెలిపారు.

మరిన్ని వార్తలు