నారపల్లిలో 285 గ్రాముల గంజాయి ప్యాకెట్ల స్వాధీనం
29-09-2026 | 10:55pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్(Ghatkesar Excise Police Station) పరిధిలో మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ టీం లోని ట్రైన్ ఏఈఎస్ ముస్తఫా సిద్దిక్ తో సిబ్బంది కలిసి నారపల్లి సాయి టీచర్స్ కాలనీలో షంషేర్ అలీ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ ల వద్ద 95 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పర్బిని నుంచి ఈ గంజాయి పాకెట్లను దిగుమతి చేసుకున్నట్లు,
ఈ గంజాయి ప్యాకెట్లను తూకం వేయగా 285 గ్రాములుగా ఉన్నట్లు ఏఈఎస్ తెలిపారు. మూడు గ్రాముల చొప్పున తయారు చేసిన ఈ గంజాయి పాకెట్లను రూ. 300 చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడయింది. నిందితులను గంజాయి పాకెట్లను ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.