డంపింగ్ యార్డ్ సమస్యపై రాజకీయాలొద్దు

24-10-2026 | 06:33pm

జవహర్ నగర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ సమస్యపై రాజకీయ పోటీ కాదు అని ప్రజా ఉద్యమకారులతో కలిసి ముందుకు రావాలని జిల్లాలోని ఎంపీ ఎమ్మెల్యేలు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా మద్దతు తెలపడం హర్షనీయమని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఈ మేరకు షేక్షావలి మీడియాతో మాట్లాడుతూ రామ్కీ చెత్త డంపింగ్ యార్డ్ ఎత్తివేత కోసం గత ఐదు నెలలుగా ప్రజా ఉద్యమం కొనసాగిస్తుండగా తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేస్తున్న ప్రకటనలు స్వాగతించారు. 

ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని ప్రభుత్వం అఖిలపక్షంలో కొనసాగడం కంటే దాని నుంచి వైదొలిగి డంపింగ్ యార్డ్ తొలగింపునకు ఉమ్మడిగా పోరాడాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్లో నెలకొని ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి కలుగుతున్న నష్టాలపై జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ నుండి నేటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ వరకు వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు నిరంతరం పోరాటం చేస్తున్నాయని తెలిపారు.

ఈ ఉద్యమానికి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా దీక్షలు సమావేశాలు చేయడం ప్రజల్లో ఆశలు రేకిస్తున్నాయన్నారు. డంపింగ్ యార్డ్ ను తొలగించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏం చేయడానికి అయినా బిజెపి సిద్ధమని ఎంపీ ఈటెల ప్రకటించిన నేపథ్యంలో డంపింగ్ యార్డ్ కు సంబంధించిన కీలక పర్యావరణ అనుమతుల ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ప్రజలకు స్పష్టమైన హామీలు ఇవ్వడంతో పాటు ఆచరణలో ఫలితాలు సాధించేందుకు ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంయుక్తంగా ముందుకు రావాలన్నారు

మరిన్ని వార్తలు