విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్, పలకల పంపిణీ
గిరిజన గ్రామాల్లోని 300 మంది విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్, పలకల పంపిణీ
పేద విద్యార్థులకు అండగా గ్రేస్ సర్వీస్ సొసైటీ, అభినందించిన ఎంఈఓ జీవి సత్యనారాయణ
వెంకటాపురం (నూగూరు),(విజయ క్రాంతి): మండల పరిధిలోని నూగూరు, వెంకటాపురం, శాంతినగర్, పాత్రాపురం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 300 మంది గిరిజన విద్యార్థులకు వెంకటాపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జీవి సత్యనారాయణ(Mandal Educational Officer G.V. Satyanarayana) చేతుల మీదుగా బ్యాగులు, నోట్ బుక్స్, పలకలను పంపిణీ చేశారు. పల్లె ప్రాంతాల్లోని పేద గిరిజన విద్యార్థుల చదువుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ(Grace Service Society) వ్యవస్థాపకులు బిషప్ మారినేని జాకబ్ ని ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలను బడికి పంపించి చదువుపై శ్రద్ధ పెట్టేలా చూడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు మురళీకృష్ణ రెడ్డి,కల ప్రసాద్,ముర్రం రాజేష్, కంతి ముత్తయ్య, లక్ష్మణరావు,అదిశివ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.