కరెంట్ షాక్‌తో మహిళ మృతి

20-09-2026 | 12:15am

చేగుంట,(విజయక్రాంతి): ఇంట్లో బాత్ రూమ్ లోకి స్నానము చేయడానికి వెళుతున్న క్రమం లో ప్రమాదవశాత్తు  వాటర్ హీటర్ ను తగిలి కరెంట్ షాక్ తో చనిపోయిన సంఘటన చేగుంట లో చోటుచేసుకుంది. చేగుంట పోలీస్ వివరాల ప్రకారం... చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సంధ్య( 29), పుట్టుకతోనే దివ్యాంగురాలు, తన తల్లిదండ్రులతో కలిసి చేగుంట పట్టణ కేంద్రంలో కిరాయికుంటూ జీవనం కొనసాగించేవారు, సంధ్య శనివారం మధ్యాహ్నం స్థానం చేయడానికి బాత్రూంలో వాటర్ హీటర్ పెట్టి, స్నానం చేయడానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు ఆమెకు తగలడంతో అక్కడికక్కడ మృతి చెందింది.  ఇట్టి విషయములో మృతురాలి తల్లి  బాయికాడి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు