అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్
20-09-2026 | 12:06am
రామయంపేట,(విజయక్రాంతి): స్థానిక అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల(Ganesh Navaratri) సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అంబేద్కర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, డాకి స్వామి, పుట్టి సందీప్ పాల్గొన్నారు. వీరికి యూత్ క్లబ్ సభ్యులు ఓద్ది విష్ణు, బైరం శేషి, బైరం ఓంకార్ శాలువాలతో సన్మానించారు. తదుపరి కౌన్సిలర్ రాసేట్ అన్న ప్రసాద్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.