తినుబండారంలో బొద్దింక

01-11-2026 | 11:09pm

ఘట్ కేసర్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఘట్ కేసర్(Ghatkesar) పట్టణం బాలాజీ నగర్ కు చెందిన సాన్యం జగదీశ్వర్ రావు ఆదివారం సాయంత్రం కొండాపూర్ రోడ్ లో గల మితుర మిస్తాన్ బండార్ లో పెద్ద సమోసలు 14, చిన్నవి 10, పకోడీ, టమాటా సాస్ తీసుకుని ఇంటికి వెళ్ళి తీసి చుసే సరికీ టామాటా సాస్ లో బొద్దింక తెలియాడుతుంది. వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేశామని దీంతో ఘట్ కేసర్ పోలీసులు వచ్చి తనిఖీలు  నిర్వహించారు. కావున కల్తీ, శుభ్రత లేని తినుబండారాలు విక్రయిస్తున్న స్వీట్ షాప్ యజమానిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు జగదీశ్ కోరారు.

మరిన్ని వార్తలు