త్రీ ఇంక్లైన్ బంగ్లౌస్ నందు బతుకమ్మ సంబురాలు

10-10-2026 | 11:30pm

కొత్తగూడెం అక్టోబర్ 10 విజయక్రాంతి : కొత్తగూడెం ఏరియాలోని(Kothagudem Area) త్రీ ఇంక్లైన్ బంగ్లౌస్(Three Incline Bungalows) నందు  తేదీ.10.10.2026, శనివారం,బతుకమ్మ పండుగ(Bathukamma celebrations) పురస్కరించుకొని ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ్మనికి ముఖ్య అతిధి గా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ(Ch. Venkataramana), విశిష్ట అతిథిగా కొత్తగూడెం ఏరియా సేవా & లేడీస్ క్లబ్(Seva & Ladies Club) అధ్యక్షురాలు  సిహెచ్ గీతా రాణి  హాజరయ్యారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వివిధ రకాల పూలతో బతుకమ్మలను, పేర్చి సంబురాలను అట్టహాసంగా  నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిఎం  మాట్లాడుతూ  బతుకమ్మ పండుగలో బతుకమ్మలను వివిధ రకాల పూలతో  పేర్చినట్లుగా, సింగరేణి సంస్థ కూడా ఒక కుటుంబంగా కలిసి ఉంటుందని  తెలియజేశారు 

కొత్తగూడెం ఏరియాలోని అందరు అధికారులు త్రీ ఇంక్లైన్ బంగ్లాస్ నందు కలిసికట్టుగా నివసిస్తూ,  బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమముకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమములో త్రీ ఇంక్లైన్ బంగ్లా ఏరియాలో నివసిస్తున్న అధికారుల  గృహిణులు,మహిళా కుటుంబ సభ్యులు  మహిళ క్లబ్ సభ్యులు,అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిభింభించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో జిఎం, ఏరియా సేవా & లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు,సిహెచ్ గీతా రాణి, ఎం. శ్రీవాణి , లేడీస్ క్లబ్ సెక్రటరీ  బంగ్లా ఏరియాలో నివసిస్తున్న అధికారుల  గృహిణులు, మహిళా కుటుంబ సభ్యులు ఇతర లేడీస్ క్లబ్ సభ్యులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు