అంబేద్కర్ సార్వత్రిక విద్య కు సువర్ణ అవకాశం
- డిగ్రీ ప్రవేశాలకు అక్టోబర్ 13 చివరి తేదీ.
- సిఆర్పిఎఫ్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె. హరి శంకర్.
జవహర్ నగర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఉన్నత చదువుల(Higher education) అభ్యసనానికి దూరవిద్య కేంద్రం(Centre for Distance Education) (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) బిఆర్ఏ ఓయూ కేంద్రం ద్వారా సిఆర్పిఎఫ్ క్యాంపస్(CRPF Campus) చక్కని సువర్ణ అవకాశం కల్పిస్తుందని అర్హులైన అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు(Application) చేసుకోవాలని సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్(CRPF Public School) వైస్ ప్రిన్సిపల్ కే .హరిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026 ఇంకా 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కోర్సులైన బిఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 13వ తేదీ చివరి తేదీ అని వైస్ ప్రిన్సిపల్ కే. హరిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981837962 లేదా 99590 344 77 నెంబర్లను సంప్రదించాలన్నారు.