ఎండిన వరి పంటలు.. కరువు మండలాలుగా ప్రకటించాలి!

27-10-2026 | 10:09pm

తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్

శివ్వంపేట, అక్టోబర్, 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మెదక్(Medak) జిల్లా జిల్లాలో ఎండిపోయిన వరి పంటలు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో ఏలినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడడంతో మెదక్ జిల్లాలో రైతులు(Farmers) వేసిన పంట వరి చివరి దశలో విద్యుత్తి అంతిరాయం కోతల వల్ల ఎండిపోయిన పంటలు ప్రభుత్వం జిల్లాలో అన్ని మండలాలు సర్వే చేసి ఎండిపోయిన పంటలకు కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు నష్టం పరిహారం ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఆ శాఖల అధికారులను జిల్లాలో అన్ని మండలాలు ఎండిపోయిన పంటలు సర్వే చేసి కరువు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతుల పక్షాన సంఘం పక్షాన ప్రభుత్వాన్ని మైసయ్య యాదవ్ డిమాండ్ చేశారు రైతులు ఆరు కాలము కష్టపడి అధిక వడ్డీలకు పెట్టుబడి పెట్టి చివరి దశలో కరెంటు కోతల వల్ల ఎండిపోయిన పంటలు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని మైసయ్య యాదవ్ సూచించారు.

విద్యుత్ చివరి దశలో కోతలు లేకుండా సకాలంలో విద్యుత్ అందిస్తే  పంటలు జిల్లాలో ఎండిపోయే పరిస్థితి లేకుండేదని విద్యుత్ కోతల వల్లనే జిల్లాలో వరి పంటలు దెబ్బతిన్నాయని మైసయ్య యాదవ్ అన్నారు దీనికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని సర్వేలు నిర్వహించి జిల్లాలో అన్ని మండలాలు సర్వే చేసి ఎండిపోయిన పంటలకు కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని రైతుల పక్షాన సంఘం పక్షాన మైసయ్య యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు

మరిన్ని వార్తలు