కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కాషాబోయిన భాస్కర్
చేగుంట, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): చేగుంట మండల కాంగ్రెస్ పార్టీలో నూతన నాయకత్వం కొలువుదీరింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లోని పార్టీ శ్రేణులను సమన్వయం చేసే లక్ష్యంతో నూతన మండలాధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్. అంజనేయులు గౌడ్ ఆదివారం కాషాబోయిన భాస్కర్‌ను మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
మండలాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న కాషాబోయిన భాస్కర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పార్టీ శ్రేణులు తెలిపారు. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని నూతన అధ్యక్షుడి నియామకంపై పార్టీ వర్గాలు వెల్లడించాయి