తూప్రాన్ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

28-09-2026 | 08:37pm

తూప్రాన్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గుర్రం జాషువా 131వ జయంతిని పురస్కరించుకొని తూప్రాన్ హైస్కూల్(Toopran High School) యందు 9, 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలను మండల విద్యాధికారి పార్వతి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో విజయం సాధించిన విద్యార్థులకు, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అవధాన విద్యావికాస పరిషత్ అధ్యక్షులైన మారుమాముల దత్తాత్రేయ శర్మ జాషువా సాహిత్యం మానవతా వాదం" అను అంశంపై వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు