నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

28-09-2026 | 09:30pm

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ(Telangana State Media Academy) చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar project)ను సోమవారం సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు ప్రాంగణంలోని చారిత్రాత్మక గోల్ బంగ్లాను అధిరోహించి, అక్కడ నుంచి ప్రాజెక్టు రమణీయ దృశ్యాలను, ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, నీటి విడుదల వివరాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి మట్టం, ఆయకట్టుకు నీటి సరఫరా తదితర కీలక అంశాలపై స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు  మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఓ ఎస్ డి రహమాన్, టి యు డబ్ల్యూ జె జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌లతో పాటు స్థానిక మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు