అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మల సేవలు అభినందనీయం
28-09-2026 | 09:00pm
బిజెపి మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): మసాయిపేట్ పట్టణ కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్ మిలన్ కార్యక్రమం(Angan Milan Program) నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను మండల బిజెపి(BJP) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎశం నవీన్ యాదవ్, బీజేవైఎం అధ్యక్షులు విఠల్, గౌరగల్ల రాములు, కిసాన్ మోర్చా కార్యదర్శి ముక్క యాదగిరి, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.