పని చేయని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

28-09-2026 | 09:13pm

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం మిట్యతండా గ్రామ శివారు మర్రికుంట తండా రైతుల వ్యవసాయ బావులకు విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని, మరమ్మతు చేయించాలని విద్యుత్ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపించారు. వారం రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల పంట పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(electrical transformer)కు మరమ్మతులు చేయించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు.

మరిన్ని వార్తలు