పాంచజన్య ఇంద్రవెల్లి బహిరంగ సభను విజయవంతం చేయండి
మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్
బెల్లంపల్లి: పాంచజన్య ఇంద్రవెల్లి బహిరంగ సభకు(Panchajanya Indervelli Public Meeting) ప్రజలు పెద్ద ఎత్తున తరలి విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ పిలుపు ఇచ్చారు. బెల్లంపల్లిలో పాంచజన్య సభ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ నెల 30న జరిగే ఇంద్రవెళ్లి పాంచజన్య బహిరంగ సభను టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. భారీ ఎత్తున తరలి రావాలన్నారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్, బెల్లంపల్లి ఇంచార్జ్ బండారి శ్రీనివాస్ గౌడ్, మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శేషికాంత్, టీ ఆర్ ఎస్ కార్యకర్తలు స్వరాజ్ మహంతి, కార్తీక్, శ్రీనాథ్, రేవంత్, శ్రావణ్, సల్ల సాయి ప్రేమ్, ఇందూరి సాయి,ఖాదర్ పాల్గొన్నారు.