తెలంగాణ పంచాయతీ మాస పత్రిక ఆవిష్కరణ
మంచిర్యాల ( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో(District Collectorate Office) అదనపు కలెక్టర్ చంద్రయ్య (స్థానిక సంస్థలు) ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ పంచాయతీ మాస పత్రిక విడుదల కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు.
ప్రభుత్వ పథకాలు, పరిపాలనా అంశాలను ప్రతిబింబించే పత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా అధికారుల సమన్వయం, బాధ్యతాయుత పాలనను మరింత బలోపేతం చేయడమే ఈ పత్రిక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సతీష్ కుమార్, ఏపిడి మోహన్, ఎంపీడీఓలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.