సదరం క్యాంప్ లో దివ్యాంగులకు వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని(Sadaram camp) సందర్శించి దివ్యాంగుల(Disabled)కు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సదరం శిబిరంలో దివ్యాంగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న శిబిరాలకు హాజరయ్య దివ్యంగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని, జిల్లాలోని అన్ని మండలాల నుండి శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.






