టాస్క్‌ఫోర్స్ దాడిలో నలుగురు అరెస్ట్

25-11-2026 | 06:18pm

- రూ.8,930 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ, బెల్లంపల్లి బస్తీలో పేకాటపై టాస్క్ ఫోర్స్ ఉక్కు పాదం మోపింది. డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్న జూదగాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force police) బుధవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు.

నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్ తన సిబ్బందితో చేసిన ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు పట్టుపడ్డారు. ఘటనస్థలి నుంచి కొంత నగదు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దేవసాని సత్యనారాయణ, (బెల్లంపల్లి బస్తీ) తుల భరత్ కుమార్(8 ఇంక్లైన్ కాలనీ, గోదావరిఖని), దాసరి నాగేష్, (బెల్లంపల్లి), అనపర్తి రాజలింగు, (బెల్లంపల్లి) లను టాస్క్ ఫోర్స్ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల మంచి రూ.8,930 నగదు 4 సెల్‌ఫోన్లను లభించాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను చట్టపరమైన చర్యల నిమిత్తం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.

మరిన్ని వార్తలు