రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనా అవినీతిమయం
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) వెయ్యి రోజుల పాలన అవినీతిలో పడగలెత్తిందనీ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ కు వెళ్తున్న ఆయన బెల్లంపల్లి(Bellampalli) పట్టణం గంగారం నగర్ లో వంటవార్పు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన్నంత కమిషన్ల మాయంగా సాగుతున్నాదనీ తీవ్రంగా విమర్శించారు. ప్రజల కోసం పెట్టినా కెసిఆర్(KCR) సంక్షేమ పథకాలను కుట్రపూరితంగా ఆపేశారని ఆరోపించారు.
పక్క రాష్ట్రంలో గురువు చంద్రబాబు పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పథకాలను రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారన్నారు. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్(BRS) పాలనను కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే రెండేళ్లలో బిఆర్ ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, స్థానికి నాయకులు పాల్గొన్నారు.






